¡Sorpréndeme!

భవిష్యత్తులో ప్రతి ఏడాది రెండు ఐపీఎల్ సీజన్లు, ఇక ఫాన్స్ కి పండగే *Cricket | Telugu OneIndia

2022-07-29 1 Dailymotion

Every Year Two IPL Seasons Will be Conducting in near Future Says Ravi shastri

టీ20 లీగ్‌లకు పెరుగుతున్న ఆదరణ వల్ల సంవత్సరానికి రెండు ఐపీఎల్ సీజన్‌లు జరగడం ఖాయమని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని మరోసారి బల్లగుద్ది చెప్పాడు. టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ఒక నార్మల్ ఐపీఎల్‌తో పాటు నాకౌట్ తరహాలో మరో ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పాడు. 'భవిష్యత్తులో రెండు ఐపీఎల్ సీజన్లు ఉండవచ్చని నేను కచ్చితంగా భావిస్తున్నాను. నేను అది జరిగితే అస్సలు ఆశ్చర్యపోను కూడా. అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక క్రికెట్‌ టోర్నీలను తగ్గించినట్లయితే.. మీరు ఏటా రెండు ఐపీఎల్ సీజన్లను చూడొచ్చు.

#BCCI
#ICC
#IPL
#RaviShastri
#National
#Cricket